Breaking

Tuesday, 15 July 2014

Ice Cream Movie Budget is Just 2 Lakhs - RGV's Second Press Note

             This is the Exclusive new Press meet of Ram Gopal Varma to explain the Process of ICE CREAM movie success and he created the sensation with the words by saying that ICE Cream movie was made with the budget of 2 Lakhs. Read the complete Press not that released by RGV in his facebook page.


Ice cream సినిమా తియ్యడానికయిన ఖర్చు 2 లక్షల 11 వేల 8 వందల 32 రూపాయిలు.

ఐస్ క్రీం తయారీ వెనకాల వున్న మెలుకువలని అర్ధం చేసుకుంటే ప్రస్తుతమున్న ఫిల్మ్ ఇండస్ట్రీ స్ట్రక్చర్ కొలాప్స్ అయిపోయి ఒక సరికొత్త ఫిల్మ్ఇండస్ట్రీ పుడుతుంది.

అది ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఎకనామిక్స్ మొత్తం, ఆడియన్స్ ని గ్రిప్ చేసే కంటెంటు, దాన్ని తెరపైకెక్కి౦చటానికి పెట్టే ఖర్చు మీద డిపెండ్ అవుతాయి. కంటెంట్ అనేది పది కోట్లుఖర్చు పెట్టినా బోర్ కొట్టచ్చు...కోటి రూపాయలుతో తీసినా ఇంట్రెస్టింగా ఉండచ్చు. ఖర్చు పెట్టినంత మాత్రాన కంటెంట్ ఇంట్రెస్టింగా ఉండాలన్న రూల్ లేదని కొన్ని వందల ఫ్లాప్ లు ఋజువు చేసాయి.

సినిమా అనేది కథ, పెర్ఫార్మన్సెస్ టేకింగ్, సౌండ్, కెమెరా, మ్యూజిక్ ల సమ్మేళనం. ఆ సమ్మేళనం సాదించటానికి యాక్టర్లు, టెక్నీషియన్లతో పాటు వివిధ రకాల ఎక్విప్మెంట్లు అవసరమవుతాయి. సినిమాకి ఖర్చు అనేది యాక్టర్లకి టెక్నీషియన్లకి పేమెంట్ల మూలాన, ఎక్విప్మెంట్లకి లొకేషన్లకి వగైరాలకి ఇచ్చిన రెంట్లు మూలాన...నేను సినిమా మొదట్లోనే యాక్టర్లు, టెక్నీషియన్లు, ఎక్విప్మెంట్ సప్లయర్లు, వగైరాఅందరితో మీటింగ్ పెట్టి "మీకు సినిమా ఆడుతుందని నమ్మకం లేకుండా కేవలం మీకుదొరికే పేమెంట్ కోసం చేస్తున్నారా? లేక మీకు కాన్సెప్ట్ నచ్చి ఆడుతుందనే నమ్మకంతోచేస్తున్నారా?” అని అడిగాను.. దానికి అందరూ నమ్మకంతోనేఅని చెప్పారు. అప్పుడు నేను వాళ్ల పేమెంట్ లు సినిమా హిట్ అయితేనే వస్తాయని చెప్పాను. ఒప్పుకోని వాళ్ళని వొదిలేసి వేరే ఒప్పుకునేవాల్లని వెతికి పెట్టుకోవటం జరిగింది. నేను వాళ్ళందరికీ చెప్పిందేంటంటే వాళ్లు మామూలుగా ఏం ఛార్జ్ చేస్తారో దానికన్నా ఎక్కువ ఇస్తామని.కానీ ఆ పేమెంట్ లాభాలనించి వస్తుంది. అంతే కాని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ నుంచి కాదు.

సినిమాకి లాభమొచ్చిందంటే వాళ్లు చేసిన పని సఫలమయిందని. ఫెయిల్ అయ్యిందంటేవాళ్ల పని విఫలమయిందని. అలా అయితే వాళ్ల వల్ల విఫలమైన పనులకి వాళ్ల జేబుల్లోకిడబ్బులెల్లి, వాళ్ల పనితనాన్ని నమ్మిన ప్రొడ్యూసర్ కి, కొన్న డిస్ట్రిబ్యూటర్ కి మాత్రమే నష్టం ఎందుకు రావాలన్న కాన్సెప్ట్ లోనుంచి వచ్చిందీ thought process.

ఐస్ క్రీం సినిమాలో లైట్లు, ట్రాక్ ట్రాలీలు, జిమ్మీ జిబ్ లు, స్టడీ క్యా౦లు ఏమీవాడలేదు. 70% సినిమా గింబల్ అనే ముందు చెప్పిన వాటన్నిటికంటే చాలా చీపయిన పరికరంతో తియ్యడం జరిగింది. అందుకే విజువల్స్ అంత కొత్తగా ఉన్నాయి. ఇంకా ఫ్లో-క్యా౦ పద్దతిలో సినిమా తియ్యడం మూలాన యూనిట్ లో పని చేసే వాళ్ల సంఖ్య రెగ్యులర్ సినిమా కన్నా90 శాతం తగ్గిపోయింది. షూటింగప్పుడు అందరూ బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే తినేసివచ్చేవాళ్లు. లంచ్ ఎవరికి వాళ్లు వాళ్లే తెచ్చుకునేవాళ్లు. నవదీప్,తేజస్విలు సినిమాకోసం వేసుకున్న బట్టలు వాళ్ల సొంత బట్టలు.

స్టార్లు, పాటలు, ఫైట్లు, కామెడీ లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ లేకుండా ఒకే ఒక్క లొకేషన్లో ఇద్దరే ఇద్దరు యాక్టర్లతో తీసిన ఐస్ క్రీం కి ఇంత సూపర్ ఓపెనింగ్స్ ఎందుకొచ్చాయి అనే ప్రశ్నకి ఒకరిచ్చిన సమాధానం రాం గోపాల్ వర్మ పేరుండడం అని.కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నా పేరుతోనే ఓపెనింగ్ వస్తే మరి సత్య 2 కెందుకురాలేదు.? అసలు కారణం చాలా సింపుల్. వాళ్లకి సత్య 2 ట్రైలర్ లు, దానికి సంబంధించిన ప్రచారం నచ్చలేదు, ఐస్ క్రీంవి నచ్చాయి.... కానీ అన్నిటికన్నా ముఖ్యంగా ఐస్ క్రీం కి వచ్చిన ఓపెనింగ్ ఏం ప్రూవ్ చేసిందంటే ఆడియన్స్ ని థియేటర్లోకి అట్రాక్ట్ చెయ్యడానికి ప్రొడక్షన్ వాల్యూస్ అవసరంలేదని... కేవలం ఒకఇంట్రెస్టింగ్ ఐడియా చాలని... పైసా ఖర్చులేనిది ఐడియా మాత్రమే. నేను చెప్పేదానికి చివరర్ధం ఏమిటంటే ఐడియా ఉన్నవాడెవ్వడైనా సరే ఆ ఐడియాతో మిగతా వాళ్ళని కన్విన్స్ చెయ్యగలిగితే ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా సినిమా తీసేయ్యొచ్చు.

నేను పైన చెప్పిన 2 లక్షల 11 వేల 8 వందల 32 రూపాయిల ఖర్చు ముఖ్యంగా ఆ ఇంటి రెంట్ కి, టీలకి, కాఫీలకి అయ్యింది. ఆ ఇంటి ఓనర్ సినిమా టీం లో భాగం కాదు కనక ఆ రెంట్ ఖర్చు తప్పలేదు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే నేను ఐస్ క్రీం లో ఆ ఇంటిని ప్రెజెంట్ చేసిన విధానం నచ్చి ఐస్ క్రీం 2 లొకేషన్ ఓనర్ ఐస్ క్రీం 2 సినిమా టీంలో తను కూడాభాగమవ్వడానికి ఒప్పుకున్నారు..

ఐస్ క్రీం సూపర్ హిట్ అయ్యి లాభమొచ్చిన మూలాన ఐస్ క్రీం సక్సెస్మీట్ లో నిర్మాత రామ సత్యనారాయణ గారు పని చేసిన అందరికీ వాళ్ల వాళ్ల పేమెంట్ లు అందజేస్తారు.

Pages